అగరుబత్తీల పొగ ప్రమాదకరం

గుప్పుగుప్పుమంటూ వదిలే సిగరెట్‌ పొగతో పాటు ఇళ్లల్లో వెలిగించే అగరుబత్తీల పొగకూడా ఆరోగ్యానికి హానికరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కని వాసనతో మనసుకు ప్రశాంతత కల్పించే ఈ పొగ ఊపిరిత్తులలోకి ప్రమాదకరమైన రసాయనాలను చేరుస్తోందన్నారు. అగరుబత్తీలు, వాటి నుంచి వెలువడే పొగతో కలిగే పరిణామాలపై తొలిసారి చైనా పరిశోధకులు అధ్యయనం జరిపా రు. అగరుబత్తీల పొగలో మొత్తం 64 రకాల రసాయనాలు ఉన్నట్లు తేలిందన్నారు. వీటిలో చాలా మటుకు హానికరం కాకపోయినా.. కొన్ని మాత్రం కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని సౌత్‌ చైనా వర్సిటీ పరిశోధకుడు రోంగ్‌ జో వివరించారు. అగరబత్తీల నుంచి పొగతో పాటు గాలిలో కలిసిన రసాయనాలు ఊపిరితిత్తులలోకి చేరి వాపునకు దారితీస్తాయని వివరించారు. దీంతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్‌, చైల్డ్‌హుడ్‌ లుకేమియా, బ్రెయిన్‌ ట్యూమర్‌కు కారణమవుతోందని తెలిపారు.

Share It All your friends

- See more at: http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved