అతడే ఓ అంబులెన్స్… మీరు గ్రేట్ సార్!

మనం బాగుంటే చాలు..లోకంతో నాకెందుకులే అనుకునే వాళ్లే తప్ప… ఇతరుల పట్ల ప్రేమతో మెలిగే వాళ్లు ఎంతమందున్నారిప్పుడు.? అంటే ఠక్కున సమాధానం చెప్పడం చాలా కష్టమైన పనే…! కానీ ఓ వ్యక్తి మానవత్వానికి మారుపేరుగా… తానే ఓ నడిచే అంబులెన్స్ గా సహాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు. అతని గురించి కాసింత తెలుసుకొని…. అతని ఆశయాన్ని అభినందిద్దాం…. వెస్ట్ బెంగాల్ లోని జల్పైగురి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి. ఆరోగ్యం బాగోలేదని ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, వెంటనే వచ్చి వారిని హాస్పిటల్ చేరుస్తాడు. తనకెన్ని పనులు ఉన్నా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. అందుకు తన ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ గా ఉపయోగిస్తున్నాడు.

24 గంటలు ఇతరుల కోసం పనిచేస్తాడు. ఒక్క పైసా కూడా తీసుకోడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఆ గొప్ప వ్యక్తిని ప్రశ్నిస్తే “కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, అందుబాటులో వైద్యులు లేరు, సమయానికి అంబులెన్స్ లేక ప్రాణాలు విడిచింది. అందుకే తన తల్లిని దూరం చేసుకున్నట్లు ఇతరుల కూడా ఆ బాధకు గురికాకూడదని ఇలా గొప్ప మనసుతో ప్రజాసేవ చేస్తున్నాడు.మరి ఇతడే కదా మన రియల్ హీరో. హ్యాట్సాఫ్ టు యు సార్. ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి పేరు చెప్పలేదు కదూ. కారిముల్. అత్యవసర పరిస్థుతుల్లో ప్రాణాలను కాపాడుతున్న మానవత్వం ఉన్న వ్యక్తి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved