గుండెలు అలసిపోయే లాగా ఏడ్చెంత బాధ గుండెల్లో గూడుకట్టుకున్నాకూడా ఏడ్చేన్నికన్నీళ్లు కళ్ళల్లో లేక,ఆదుకునే అండ లేక,ఏం చేయాలో పాలుపోక,ఎటు పోవాలో దారి లేక,చస్తూ బ్రతుకుతూ ఉండలేక,ఆకలి బాధలకి తాళలేక,ఈ లోకం లోకి ఎందుకు వచ్చామో అర్ధం కాక,భవిష్యత్తు భవితవ్యాన్నితలచుకునే ధైర్యంలేక, రేపు ఎలా గడవాలో దిక్కు లేక మేము బ్రతుకుతుంటే రాజకీయాల కోసం,సినిమా హీరోల కోసం,స్వార్ధం కోసం, పనికిమాలిన విషయాల కోసం,పగల కోసం,కుళ్ళు కుతంత్రాల కోసం మీరెందుకు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు అన్నలు...

మా గురించి ఆలోచిన్చేంత సమయము,ఇంట్రెస్ట్ మీకు ఉండదని మాకు తెలుసు.... మా గురించి ఆలోచించమని కూడా మిమ్మల్ని అడగట్లేదు.....మీ గురించి అయినా మీరు శ్రద్ధ

పెట్టండి...చిన్నచిన్నవిషయాల గురించి బాధ పడుతూ,టెన్షన్ పడుతూ మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి...బాధలు అంటే మావి...బ్రతుకు పోరాటం అంటే మాది.....ఏ పూట అన్నం తింటామో,ఏ పూట పస్తు ఉంటామో మాకే తెలియదు.....ఏ రోజు ప్రాణాలతో ఉంటామో,ఏ రోజు ఈ లోకాన్నివిడిచివెళ్లిపోతామో మాకే తెలియదు.....బ్రతికి ఉన్నన్నిరోజుల్లో అసలు ఆనందం అనే ఒక పదాన్నిఒక్క సారైనా ప్రత్యక్షంగా అనుభవించగలమో కూడా మాకు తెలియదు....

మమ్మల్నిచూసి మమ్మల్నిఉద్దరించక పోయినా పర్లేదు....మమ్మల్నిచూసి మాకన్నా మీరు ఎన్నిరెట్లు better స్థితిలో ఉన్నారో పోల్చుకోండి......పోల్చుకుని మీరు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితాన్నిమీకు కల్పించినందుకు ఆ దేవుడికి,మీ తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకోండి....బ్రతికి ఉన్నంత కాలం ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించండి...వీలైతే మా లాంటి అభాగ్యులకి ఒక పూట కడుపు నింపడానికి ప్రయత్నించండి...

-ఇట్లు

ఒకవైపు ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తూ,మీకు జీవిత పాటాన్నిచెప్పాలని ముందుకి వచ్చిన ఒక అభాగ్యుడు....


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved