అర్ధరాత్రి మృత్యుసాగరంలోకి..

తమ దేశాన్ని వీడి వారంతా గ్రీసు దేశానికి బిక్కుబిక్కుమంటూ బయలుదేరారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండు పడవల్లో కిక్కిరిసిపోయారు. చిన్నారులు, వయసుపైబడినవారు, యువకులు, మహిళలు ఇలా అందరు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే చివరకు ప్రాణాలతో తీరం చేరగా చాలామంది జలసమాధి అయ్యారు. లెస్బాస్కుకు చెందిన ఉత్తర గ్రీక్ ఐలాండ్ తీరంలో రెండు పడవల ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఓ పడవ పూర్తిగా మునిగిపోయి అందులో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోగా.. మరో పడవ స్థానికులు కొందరు స్వచ్ఛంద సేవకులు, నావికా దళం చర్యలవల్ల తీరం వరకు చేరి మునిగిపోయింది. ఇందులో ఉన్నవారిలో కూడా కొందరు ప్రాణాలువిడిచారు. మరో కొద్దిక్షణాల్లో తీరం చేరుకుంటామనుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీ నుంచి కొందరు నిరాశ్రయులు, వలసదారులు రెండు పడవల్లో బయలుదేరి స్కాల సికామినియాస్ తీరం చేరుకునేలోపే రాత్రికిరాత్రి అనూహ్యంగా ఈ ప్రమాదానికి గురైంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved