ఆటోను నడిపితే వచ్చే బాడుగలతో గడిచే ఆ కుటుంబం ఈనాడు కష్టాల్లో కూరుకుపోయింది

ఒక లారీ డీ కొనడంతో ద్వంసమైన ఆటోకు చెందినవి.

ఈ ఫోటోలను చూసిన వారికెవరికైనా , ఖచ్చితంగా ఆటో డ్రైవర్ ప్రాణానికి ముప్పు కలిగి ఉంటుందనే అనుకుంటారు.

కానీ ఆ ఆటో డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు గానీ, ఎన్నో గాయాలపాలయ్యాడు.

తన ఆటో ద్వారా ఎంతో మందికి సాయపడ్డ అతని మంచి మనస్సే , అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాపాయం జరగకుండా అతన్ని కాపాడింది.

కానీ అతని కుటుంబ జీవనానికి ఆధారమైన ఆటో పూర్తిగా దెబ్బతింది.

వివరాల్లోకి వెళితే.............

ఇక్కడున్న ఫోటోలలో గాయాలతో ఆసుపత్రి బెడ్ పై ఉన్న వ్యక్తి పేరు భాషా.

ఇతను ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు.

ఆటోను నడుపుకుంటూ భార్యా బిడ్డలను , వృద్ధురాలైన తల్లిని పోషించుకుంటున్నాడు.కానీ అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో ఇప్పుడు కష్టాలపాలయ్యాడు.

పది రూపాయలు ఆటో బాడుగ అయితే పాతిక రూపాయల బాడుగను డిమాండ్ చేసే ఆటోవాలాలు ఉన్న రోజులివి.

అలాంటిది తాను ఆటోలో వెళుతున్న దారిలో ఎవరైనా వృద్ధులుగానీ, వికలాంగులు గానీ కనిపిస్తే, వారిని తన ఆటోలో ఉచితంగా ఎక్కించుకొని ఇళ్ళ వద్దకు చేర్చేవాడు భాషా.

పురిటి నొప్పులతో ఉన్న గర్భిణులను అర్ధరాత్రి వేళ అయినా సరే ఎంతో ఓపికగా ఆసుపత్రులకు ఉచితంగా చేర్చేవాడు.

ఎవరైనా అనాధలకు , అభాగ్యులకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే , మీ సేవలలో నేనూ నా వంతుగా భాగస్వామిని అవుతానంటూ, నేను సైతం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉచితంగా ఆటోను నడిపిన భాషా అనే వ్యక్తి ఇప్పుడు కన్నీటి బాధల్లో ఉన్నాడు.

ఆటోను నడిపితే వచ్చే బాడుగలతో గడిచే ఆ కుటుంబం ఈనాడు కష్టాల్లో కూరుకుపోయింది.

తన ఆటో ద్వారా ఎందరికో సాయపడ్డ భాషాను ఒక లారీ డీ కొనడంతో ఆటో ద్వంసమై , భాషా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అందరి మంచినీ కోరుకున్న భాషా ను ఆదుకునేందుకు మానవత్వంతో స్పందిద్దాం. మంచి మనసుతో చేయూతనిద్దాం


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved