ఇంటర్నెట్ వినియోగంలో మనం నెం.2! ఏమి చేస్తున్నారో? ఏమి చూస్తున్నారో?

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ త్వరలోనే అమెరికాను దాటేసి రెండో స్థానానికి చేరనుంది. ఈ విషయం ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎంఏఐ) విడుదల చేసిన ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఇండియా 2015’ అధ్యయన పత్రంలో వెల్లడయ్యింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో 402 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ని వినియోగిస్తారని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సంఖ్యకు చేరుకుంటే.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని వినియోగిస్తున్నవారి విషయంలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టి భారత్‌ రెండో స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇంటర్నెట్‌ వినియోగంలో మొదటి స్థానంలో చైనా ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved