ఒక చెట్టుకు 40రకాల ఫలాలు

రంగురంగుల్లో కనిపించడంతో పాటు రకరకాల పండ్లనూ ఇస్తుందీ చెట్టు. అవును రకరకాల పండ్లే. అదీ ఒకటీ రెండూ కాదు.. కొమ్మ కొమ్మకో పండు చొప్పున ఏకంగా 40 రకాల పండ్లు ఒక్క చెట్టుకే కాస్తాయంటే ఆశ్చర్యమే! అయితే అంటుకట్టడం వల్ల ఇది సాధ్యమైందని దీన్ని తయారు చేసిన వాన్‌ అకెన్‌ చెబుతున్నాడు. సిరాకస్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అయిన వాన్‌ది రైతు కుటుంబ నేపథ్యం కావడంతో మొక్కలపై సహజంగానే ఆసక్తి ఎక్కువ. దీంతో ఈ ప్రత్యేకమైన చెట్టుకు జీవం(?) పోశారు. వేసవి కాలంలో మామిడి, జామ, దానిమ్మ ఇలా రకరకాల పండ్లతో ఈ చెట్టు మనోహరంగా కనిపిస్తుందని వాన్‌ అంటున్నారు. కావాల్సిన వారికి వీటిని తయారు చేసి అమ్ముతానని కూడా చెబుతున్నారు. మీకూ ఓ చెట్టును సొంతం చేసుకోవాలని ఉంటే 30 వేల డాలర్లను సిద్దం చేసుకోండి. అన్నట్టు మరో విషయం.. ఒకటి నుంచి పదేళ్లలోపు ఈ చెట్టు ఎప్పుడైనా కాపునకు రావచ్చట.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved