కనకదుర్గ ఫ్లైఓవర్‌ శంకుస్థాపన 22న

కనకదుర్గ ఫ్లైఓవర్‌ శంకుస్థాపన ముహూర్తం ఖరారయింది. ఇప్పటికే అక్రమ ఇళ్లను తొలగించిన అధికారులు... పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 7.30 గంటలకు భూమిపూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన గట్కారీ హాజరయ్యే అవకాశం ఉంది. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు శరవేగంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. కేవలం ఏడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా కలెక్టర్‌ బాబు. ఎ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన వెంటనే సోమా కంపెనీ వారు పనులు ప్రారంభిస్తారు. మొదటగా టెస్టింగ్‌ పిల్లర్‌ను నిర్మించనున్నారు. ప్లానలో ఉన్న దాని ప్రకారం టెస్టింగ్‌ పిల్లర్‌ ఎంత బరువును తట్టుకోగలుగుతుందో పరిశీలిస్తారు. దాని ఆధారంగా మిగిలిన 50 పిల్లర్ల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే సోమా కంపెనీకి జిల్లా అధికారులు గొల్లపూడి సమీపంలోని మార్బుల్‌ ఎస్టేట్‌ను కేటాయించారు. ఇదే స్థలంలో మరో రెండు రోజుల్లో సోమా కంపెనీ నిర్మాణ సామగ్రిని డంప్‌ చేస్తారు. ఇప్పటికే సోమా కంపెనీ ఇంజనీర్లు కూడా నగరానికి చేరుకున్నారు. వారు జిల్లా అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని సందర్శించారు.

స్థలం ఇచ్చేందుకు వక్ఫ్‌బోర్డు నిరాకరణ

గొల్లపూడి సమీపంలో సోమా కం పెనీ వారికి కేటాయించిన 40 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు చెందినది కావడంతో వారు స్థలం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఆ స్థలం ప్రభుత్వానికి అందిస్తే తిరిగి తమ పరిధిలోకిరాదనే అ భద్రతా బావంతో వారు ఉన్నట్లు సమాచారం. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయిన త ర్వాత తిరిగి స్థలం వక్ఫ్‌ బోర్డు వారికి అంది స్తామని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఎన్నిసార్లు నచ్చచెప్పినా వినకపోవడంతో వారు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ వక్ఫ్‌బోర్డు వారితో మాట్లాడమని ఉన్నతాధికారులను ఆదేశించారు. వారితో మాట్లాడేందుకు జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

దుర్గగుడి వద్ద

కొండభాగం తొలగింపు

కుమ్మరిపాలెం సెంటర్‌ దగ్గర నుంచి ఇళ్లను తొలగించిన అధికారులు... కనకదుర్గ గుడి వల్ల 80 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు వరకూ కొండను తొలగించనున్నారు. శుక్రవారం ఉదయ మే తొలగించాల్సి ఉన్నా, సమీపంలో నివాసం ఉంటున్న వారి ఇంటిలో పెళ్లి పెట్టుకోవడంతో తొలగింపు కార్యక్రమాన్ని నిలిపి వేశారు. శనివారం ఉద యం 11 గంటలకు కొండ భాగాన్ని తొ లగిస్తారు. ఇదే ప్రాంతాన్ని శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించి కొన్ని సూచనలు కూడా అందించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved