పచ్చివే మేలా? వండి తినాలా?

కొన్ని రకాల కూరగాయల గురించి మనకు కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటోంది. వాటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరంటారు. లేదు.. వండుకుని తినాలని ఇంకొందరంటారు. వీటిలో ఏది నిజం?

వీటిని పచ్చిగానే తినాలి బీట్‌రూట్స్‌: బీట్‌రూట్‌లో మెదడుకు, గుండెకు అవసరమైన ‘ఫోలేట్‌’ ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఫోలేట్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బీట్‌రూట్‌ను ఉడికిస్తే ఈ కాంపౌండ్‌ నశిస్తుంది. కాబట్టి బీట్‌రూట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్‌ రూపంలో తీసుకోవటమే మేలు.

బెల్‌ పెప్పర్‌: పచ్చి బెల్‌ పెప్పర్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది హృద్రోగాలు, కంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బెల్‌ పెప్పర్‌ను పచ్చిగా లేదా కొద్దిసేపు సాట్‌ చేయాలి గానీ మెత్తగా ఉడికించేయకూడదు.

వీటిని వండాల్సిందే!

టమేటా: టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్‌ ఫైటోకెమికల్‌ లైకోపైన్‌ ఉంటుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా శోషించుకోవాలంటే టమేటాలను ఉడికించి తినాల్సిందే!

పుట్టగొడుగులు: వీటిలో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్‌ ఉంటాయి. వాటితోపాటే స్వల్ప పరిమాణంలో టాక్సిన్స్‌ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్‌ను హరించి పాలీశాఖరైడ్స్‌ శరీరానికి వంటబట్టాలంటే పుట్టగొడుగుల్ని ఉడికించి తినాలి.

ఆస్పరాగస్‌: క్యాన్సర్‌తో పోరాడే ఫెర్యూలిక్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగ్‌సని ఉడికించి తినాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved