గుండె గుట్టు తెలుసుకో

ఆహారంలో ఉప్పు తగ్గించాలి గాని పూర్తిగా మానివేయకూడదు. అలా పూర్తిగా మానివేస్తే రక్తపోటు పూర్తిగా పడిపోయే ప్రమాదముంది. ఉప్పుని ఆహారంలో తక్కువగా తీసుకునే ప్రాంతంలోని ప్రజలకు అధిక రక్తపోటు తక్కువగా వస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది.

రక్తపోటు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కొన్ని జన్మతః వచ్చేవి. వీటిని రిస్క్ ఫాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫాక్టర్స్ ఉంటే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కొన్ని మనం కొని తెచ్చుకునే కారణాలుంటుంటాయి. అధిక మానసిక ఒత్తిడి. ఒక అబద్ధం ఆడామనుకోండి, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరికొన్ని అబద్ధాలాడాల్సి వస్తుంది. అలాగే నెగెటివ్ ఆలోచన్లతోను రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్, ధూమపానం లాంటి అలవాటు చెడుపు చేస్తాయి. కాబట్టి, ఇలాంటి అలవాట్లకు దూరంగా వుండడం ఎప్పుడూ మంచిది. అధిక బరువుండడం వల్లా రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటున్నవాళ్ళ పిల్లలు, లేనివాళ్ళ పిల్లలకన్నా జాగ్రత్తగా ఉండాలి. స్టిరాయిడ్స్ వాడే వాళ్ళలో రక్తపోటు పెరగవచ్చు. గర్భిణీలలో అధిక రక్తపోటు ఉండవచ్చు. ప్రసవానంతరం మామూలు స్థితికి వస్తారు. గర్భం ధరించిన మొదటి రోజుల్లో రక్తపోటు పెరిగితే తర్వాత తర్వాత అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. మూత్ర పిండాలకు రక్తం సరఫరా చేసే ధమనిగాని లోపలి మార్గంగాని సరిగా లేకుండా పుడితే రక్తపోటు ఎక్కువగా వుండే అవకాశముంది. కొన్ని కొన్ని కంతులుండడంవల్లా రక్తపోటు పెరుగుతుంది. ప్రతీ ఆరు నెలలకీ రక్తపోటు చూపించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.ధ్యానము, యోగా, అధిక రక్తపోటుని అదుపులోకి తేవడానికి చక్కటి మార్గాలు.గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ సమతుల్యంగా రక్తాన్ని సేకరిస్తూ, తిరిగి అన్ని అవయవాలకి పంపిస్తుంటుంది. గుండె ఒకసారి తన గుండా రెండు వైపులా రక్తాన్ని పంప్ చేయడానికి 0.85 సెకన్ల సమయం పడుతుంది. ఆరికల్ ముడుచుకోవడానికి 0.15 సెకన్లు, వెంట్రికల్ ముడుచుకోవడానికి 0.3 సెకన్లు, ఆరికల్, వెంట్రికల్ ముడుచుకోవటానికి 0.40 సెకన్ల సమయం పడుతుంది. ఇలా నిర్విరామంగా పనిచేయడానికి గుండె కండరాలు నిరంతరం సంకోచ వ్యాకోచాలు చెందుతుంటాయి. ప్రతీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఓ అర సెకెండ్ మాత్రమే గుండె విశ్రాంతి తీసుకుంటుంది. శరీర ఇతర కండరాలకన్నా ఈ కండరాలకు నిర్విరామంగా పనిచేసే శక్తి ఉంది. ఈ కండరాల పని తీరు మన అధీనంలో లేదు. వాటంతటవే పనిచేస్తుంటాయి. వీటిని అనిచ్ఛాదీన కండరాలంటాం. గుండె కండరాలు అలసిపోవు. అందుకే ఏ కారణం చేతనైనా గుండె కండరాలలో భాగం చనిపోతే, ఆ స్థానంలో శరీరంలోంచి మరో కండరాన్ని తీసుకువచ్చి అమర్చినా నిర్విరామంగా ఎక్కువ కాలం పనిచేయలేక తిరిగి గుండెకి అస్వస్థత కలుగుతుంది. శరీరంలో గుండె, మెదడు కణాలు తప్ప శరీరంలోని ఏ కణాలు దెబ్బతిన్నా పునరుత్పత్తి అవుతాయి. ఈ కణాలు ఒకసారి దెబ్బతింటే ఆ లోపం లోపమే!మగవాళ్ళ గుండె కన్నా ఆడవాళ్ళ గుండె నిముషానికి ఏడెనిమిదిసార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. గుండె గదుల మధ్య కవాటాలు రక్తం ఒక క్రమ పద్ధతిలో ప్రసరించేట్టు చేస్తుంటాయి.

- See more at: http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved