జామ్ జామ్ జామ

నారింజలో కన్నా జామలో విటమిన్-సి నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే సాధారణంగా వచ్చే ఇనఫెక్షన్లు దరిచేరవు. దీనిలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి సందేహం లేకుండా వీటిని తీసుకోవచ్చు. జామలో ఫైబర్‌ ఉండడం వల్ల జీర్ణక్రియరేటు కూడా పెరుగుతుంది. ఇతర ఫలాలతో పోలిస్తే జామకాయల్లో షుగర్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. జామకాయలు తీసుకోవడం వల్ల శరీరానికి సోడియం, పొటాషియం వంటివి సరిపడా అందుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే జామకాయల్లో విటమిన-ఎ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాల వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జామకాయలోపల ఉండే తెల్లటి గుజ్జులో గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved