నీ పొడవు రహస్యం అదా?

జిరాఫీకి అంత పొడవైన మెడ ఉండడానికి గల రహస్యాన్ని శాస్త్రవేత్తలు చేధించారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జిరాఫీల మెడ కూడా సాధారణంగానే ఉండేదని పరిణామక్రమంలో అసాధారణంగా పెరిగిందని వారు గుర్తించారు. తొలుత మెడ భాగంలోని వెన్నుపూసలు తలవైపు పెరిగాయని ఆ తరువాత కొన్ని లక్షల ఏళ్ల పాటూ జరిగిన పరిణామక్రమంలో శరీరంలో కిందివైపుకు పెరుగుతూ వచ్చాయని కనుగొన్నారు. ఈ విధంగా ఎన్ని లక్షల ఏళ్ల పరిణామక్రమంలో జిరాఫీలకు ఇంత పొడవాటి మెడలు ఏర్పాడ్డాయని.. వందల ఏళ్లనాటి జిరాఫీ శిలాజాల మెడ భాగంలోని వెన్నుపూసలను పరిశీలించి అమెరికాలోని న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ కాలేజీలోని ఆస్టియోపతిక్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అధిక ఆహారాన్ని తీసుకోవడం కోసం, వివిధ పరిస్థితులను ఎదుర్కొని మనగలగడానికి వాటికి పొడవాటి మెడ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఇంగ్లండ్‌, స్వీడన్‌, ఆసే్ట్రలియా, జర్మనీ, కెన్యా, గ్రీస్‌ దేశాల్లోని మ్యూజియాల్లో ఉన్న జిరాఫీల శిలాజాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కొన్ని జాతుల్లో మెడ భాగంలోని సీ-3 వెన్నుపూసలు తలవైపుగా పెరిగాయని, మరికొన్ని జాతుల్లో కిందివైపుకు ఎదిగాయని తెలిపారు. అయితే ఆధునిక కాలంలోని జిరాఫీల్లో రెండువైపులకూ ఈ ఎదుగుదల ఉందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved