జ్వరం వచ్చినప్పుడు నాలుక ఎందుకు చేదుగా ఉంటుంది?

మన శరీరంలో నాలుక రుచులను గుర్తిస్తుంది. ఆహార పదార్థాలు, మసాలా దినుసులు,పానీయాలలో రుచుల్ని వేరు వేరుగా గుర్తించటానికి రసాయనిక గ్రాహకాలు నాలుక మీద ఉంటాయి. నాలుక చివరి భాగం తీపిని గుర్తిస్తుంది. నాలుక పక్క అంచులు ఉప్పును గుర్తిస్తాయి. నాలుక అంచుల్లో మధ్య భాగాలు పుల్లని రుచుల్నిగుర్తిస్తాయి. నాలుక వెనుక భాగంలో దాదాపుగా గొంతు దగ్గర ప్రాంతం చేదును గుర్తిస్తుంది.

సాదారణంగా మనకు చేదు రుచి ఇష్టం ఉండదు. నాలుకపై చేదును గుర్తించే ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరిగి కొన్ని జీవక్రియలు మందగిస్తాయి. నాలుక మీద తీపి,ఉప్పు,పులుపు కన్నా చేదు గుర్తించే ప్రాంతం ఎక్కువగా ఉండుట వలన జ్వరం వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత పనిచేస్తుంది. అందువల్ల ఆహార పదార్థాలు అన్నీ చేదుగా ఉంటాయి. ఆ సమయంలో నాలుక చేదు తప్ప ఇతర రుచిని పసిగట్టలేదు. అందువల్ల ఏమి తిన్నా చేదుగానే ఉంటాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved