టీవీ చూడండి. చచ్చి స్వర్గానికి వెళ్లండి.

టీవీ అతిగా చూస్తే చిన్నా చితకా సమస్యలు కాదండోయ్‌ ఏకంగా మరణానికి దారితీసే సమస్యలే వస్తాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. రోజులో మూడు నుంచి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూస్తూ గడిపడం వల్ల వచ్చే 8 రకాల సమస్యలు మరణానికి దారితీసే అవకాశం ఉందని అమెరికాకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. క్యాన్సర్‌, గుండెజబ్బులు సహా పలు జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అమెరికాలో రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా వ్యక్తులపై పరిశోధన చేసిన అనంతరం అక్కడి నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సర్వే నివేదికను వెల్లడించింది. అమెరికాలో మరణానికి ఎక్కువ దారి తీసే జబ్బులు క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు అని వారు తెలిపారు. వీటితో పాటు డయాబెటిస్‌, న్యుమోనియా, పార్కిన్‌సన్‌, కాలేయ జబ్బులతో ఎక్కువగా మరణిస్తున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved