వాయుగుండం తుఫానుగా మారే ప్రమాదం.. హెచ్చరికలు జారీ

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం కడలూరు దగ్గర తీరాన్ని తాకింది. అక్కడ స్థిరపడిన వాయుగుండం మధ్యాహ్నం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీంతో తీరప్రాంతాలపై అది విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఈ రోజు రాత్రి లేదా ఉదయం చెన్నై కారేకల్ తీరం మధ్య పుదుచ్ఛేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీని ప్రభావం తో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని కాళహస్తి, సత్యవేడు, ప్రాంతాల్లో తిరుమలలో కుండపోత వర్షం పడుతుంది. ఇంకా నాగపట్నంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. చెన్నై విమానాశ్రయంలో 17 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. మత్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని.. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంటకు 50-55 కిమీ వేగంతో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved