దాల్చిన చెక్క సద్గుణాలు

వంటకాల్లో సువాసన కోసం వాడే దాల్చినచెక్క మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపించినప్పుడు దాల్చినచెక్క చూర్ణం, యాలకులపొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలా మరిగించి, తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాస్త తేనెను వేడిచేసి అందులో టీ స్పూన్‌ దాల్చినచెక్క పొడి కలిపి రోజులో మూడు పూటలా తీసుకుంటే మంచిది. ఆ మిశ్రమాన్ని చర్మానికి పూస్తే దురదలు, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మవ్యాధులను అరికట్టవచ్చు. జలుబు వల్ల వచ్చే తలనొప్పి తగ్గేందుకు దాల్చిన చెక్క మెత్తగా నూరి నుదురుకు పట్టీలా వేస్తే సరిపోతుంది. అధిక కొలెఎస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీ స్పూన్ల దాల్చినచెక్క పొడి, రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కడుపునొప్పి సమస్య ఉన్నవారు పదిగ్రాముల దాల్చిన చెక్కపొడి, పావు టీస్పూన్‌ దాల్చినచెక్క నూనె కలిపి సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పావులీటర్‌ నీటిలో పదిగ్రాముల దాల్చినచెక్క పొడిని కలిపి వడగట్టి తాగితే నీళ్ళ విరేచనాలను అరికట్టవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved