దుప్పటి దులిపారు. పసికందును చంపారు.

ఆసుపత్రిలో నర్సు నిర్లక్ష్యానికి నాలుగు రోజుల పసికందు ప్రాణాలొదిలింది. మంచం మీద పసికందు నిద్రిస్తుండగా శిక్షణ నర్సుగా పనిచేస్తున్న మహిళ దుప్పటి తీసి దులిపేందుకు ప్రయత్నించింది. దీంతో నేలకు బలంగా ఢీకొన్ని పసికందు అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాణి అనే మహిళ గత మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డని ఎన్‌ఐసీయూలో ఉంచగా తల్లి వేరే వార్డులో ఉంది. బిడ్డను ఆమె బంధువు చూసుకుంటూ ఉంది. ఐసీయూ వార్డులోకి వచ్చిన ఓ శిక్షణ నర్సు ఆ బంధువుని బయటకు వెళ్లాల్సిందిగా చీవాట్లు పెట్టింది. అప్పటికి బిడ్డ ఆసుపత్రి బెడ్‌పై నిద్రిస్తూ ఉంది. అది గమనించని శిక్షణ నర్సు బెడ్‌ మీద ఉన్న దుప్పటిని దులిపే ఉద్దేశంతో దాన్ని బయటకి లాగింది. దీంతో అకస్మాత్తుగా కింద పడిపోయిన బిడ్డ ప్రాణాలొదిలింది. అనంతరం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి శవపరీక్ష చెయకుండానే బిడ్డ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనను తప్పుదారి పట్టించేందుకు ఆసుపత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయని బాధిత కుటుంబం ఆరోపించింది. దీనిపై మాట్లాడేందుకు ఆసుపత్రి వర్గాలు ఎవరూ అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేసింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved