మీరు మనుషులే.........మేమూ మనుషులమే. మీరు అలా మా కాళ్ళు పట్టుకుని చెప్పులను వేసి చూపడం కాస్త ఇబ్బందిగా వుంది

నేనొక చెప్పుల షాపుకు వెళ్ళాను. ఆ షాపులోని వ్యక్తి నన్ను మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. కూర్చోమని చెప్పి చెప్పులను చూపడం మొదలు పెట్టారు.

ప్రతి ఒక చెప్పుల జతను స్వయంగా నా కాలికి తొడుగుతున్నారు. నాకెందుకో చాలా కష్టంగా అనిపించి...........

" మీరు అలా నా కాళ్ళను పట్టుకుని చెప్పులు తొడగడం చాలా బాధగా ఉంది. మీరు తీసి ఇవ్వండి నేనే వేసుకుని చూసుకుంటాను " అని చెప్పాను.

దానికి అతడు " పరవాలేదండీ! మీకు నచ్చిన చెప్పులను చూసుకుని తీసుకుని వెళ్ళండి .మీ సంతోషమే చాలు మాకు " అన్నారు.

" మీరు మనుషులే.........మేమూ మనుషులమే. మీరు అలా మా కాళ్ళు పట్టుకుని చెప్పులను వేసి చూపడం కాస్త ఇబ్బందిగా వుంది." అన్నాను.

దానికి వారు అన్న మాటలు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

" ఈ షాపులో నా బాధ్యత అది........షాపుకు బయట మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ కాళ్ళు పట్టుకోను. షాపులో మీరు కోటి రూపాయలిచ్చినా మీ కాళ్ళు వదలను." అని అన్నారు ఆ వ్యక్తి.

నిజంగా తాను చేసే పనిమీద ఆ వ్యక్తికి ఎంత గౌరవం,భక్తి ఉన్నాయో చూడండి.

ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా,పెద్దదైనా ఆ పనిమీద ఇలాంటి భావననే కలిగి ఉంటే తప్పక వారు అనుకున్నది సాధిస్తారని అనిపించింది.

ఇలాంటివారికి విజయపథం తరుఫున అభినందనలు తెలుపుతూ.

ఒక మంచి వ్యక్తి దయ చేసి షేర్ చెయ్యండి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved