రేపటి నుండి పాస్‌పోర్టులు చెల్లవట!

మీరు ఏదైనా విదేశాలకు ప్రయాణమవుదామని భావిస్తున్నారా? ఒక్కసారి మీ పాస్ పోర్టు చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ (ఐసిఎఓ) నిబంధనల ప్రకారం.. చేత్తో రాసి ఉన్న పాస్ పోర్టులు నవంబర్‌ 25వ తేదీ నుండి చెల్లవు. ఐసిఎఓ సభ్య దేశాల్లో భారత్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్న ఏ దేశం కూడా చేత్తో రాసివున్న పాస్ పోర్టులకు ఇక వీసాలు జారీ చేయవు. ఇండియాలో 2001 కన్నా ముందు జారీ అయిన పాస్ పోర్టులన్నీ చేత్తో రాసినవే. సాధారణంగా ఈ తరహా పాస్ పోర్టు రెన్యువల్ కాలపరిమితి 20 సంవత్సరాలు ఉంటుంది. వాటన్నింటినీ తక్షణం మార్చుకోకుంటే, విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతారని, రాత పాస్‌పోర్టులో కలిగి ఉన్నవారు కొత్త పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేస్తే వెంటనే జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

must share


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved