ఆర్టీసీ బస్సుపై పగబట్టిన ఆవు

ఆవు దెబ్బకు ఆర్టీసీ బస్సు రంగునే మార్చారు. ఉత్తర కర్ణాటకలోని సిర్సిలో ఈ ఘటన జరిగింది. కొన్నాళ్ల కిందట ఓ లేగదూడ ఆర్టీసీ బస్సు కిందపడి చనిపోయింది. అయితే దూడ తల్లి తన బిడ్డ చావుకు కారణమైన బస్సు డ్రైవర్‌ను గుర్తించి ఆ బస్సు అటువైపు వచ్చిన ప్రతిసారీ ముందుకు కదల కుండా అడ్డుకుంటోంది. స్థానికులు ఎంతగా ప్రయత్నించినా.. ఎన్నిసార్లు వెళ్లగొట్టినా ఆవు వెళ్లడం లేదు. సంబంధిత బస్సు వచ్చిన ప్రతిసారీ అడ్డుపడుతూనే ఉంది. తన బిడ్డ కోసం ఆ తల్లి ఆవు న్యాయపోరాటం చేస్తోంది. అయితే ఆవు దెబ్బకు ఆర్టీసీ విస్తుపోయింది. ఆ రూట్‌లో ప్రయాణించే ఆ ఒక్కబస్సునే ఆవు అడ్డుకుంటోంది. ఇలా అయితే ఆ రూట్లో బస్సు నడపడం కష్టమని భావించిన ఆర్టీసీ ఆ బస్సుకు రంగును మార్చి నడుపుతోంది. తన దూడను చంపిన బస్సును ఆ ఆవు ఎంతలా గుర్తుపెట్టుకుందో.. తల్లి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.  ‘ఆర్టీసీ బస్సుకు ఆవు అడ్డం వెళ్లడం.. బిడ్డ కోసం ఆవు న్యాయపోరాటం చేస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పై వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved