మనిషి ఆయుష్షు ఎంత?

దాదాపు 300 కోట్ల సంవత్సరాలు కొనసాగిన పరిణామ చరిత్రలో ఎన్నో జీవజాతులు ఏర్పడ్డాయి. ఈ కాల క్రమంలో సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు ఏర్పడ్డాడు. సుమారు పది లక్షల సంవత్సరాల క్రితం మానవుడి సగలు ఆయుర్దాయం కేవలం 15 ఏళ్లే. అంటే ఎవరో కొందరు మాత్రమే 30 లేదా 40 ఏళ్లు దాటేవారు. మిగిలిన వారు జంతువుల బారినపడో లేదా అనారోగ్యం వల్లో, ప్రకృతి వైపరీత్యాల వల్లనో మరణించేవారు. 20వ శతాబ్దం ఆరంభంలో (1901) ప్రపంచంలో మానవుని సగటు ఆయుర్దాయం కేవలం 30 ఏళ్లే. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిదశలో భారతీయుల సగటు ఆయుర్దాయం కేవలం 33 ఏళ్లే. అయితే ఇప్పుడు మనదేశ సగటు ఆయుర్దాయం సుమారు 65 ఏళ్లే. అయితే ప్రపంచ సగటు ఆయుర్దాయం 75 ఏళ్లు.?


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved