తుపాకులు గర్జిస్తున్నాయి......... చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తోంది.........

ఒక వీరుడు శత్రువులపైకి ఎంతో ధైర్య సాహసాలతో దూసుకెళ్లాడు....... పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి ..............దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసాడు.

అతడే ఉగ్రపోరులో వీర మరణం పొందిన లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ కి చెందిన ఆయన ఆర్మీలో ప్రత్యేక బలగాల కమాండో.సరి హద్దు కాశ్మీర్ లో ఉగ్రవాదులు కుటిల పన్నాగాలతో రెచ్చిపోతున్న ఈ సమయంలో గత 11 రోజులుగా సాగుతున్న పోరులో లాన్స్ నాయక్ గోస్వామి కూడా పాల్గొన్నారు. మొత్తంగా 10 మంది ఉగ్రవాదులను నేలకూల్చారు.

ఆగష్టు 23 న హంద్వారా లోని ఖర్మూర్ వద్ద జరిగిన తొలిపోరులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత మూడు రోజులకే ఆగష్టు 26, 27 రెండు రోజుల పాటు రఫియాబాద్ లో జరిగిన పోరులో మరో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టారు.ఇక చివరగా గురువారం జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా సమీపంలోని దట్టమైన హప్రూదా అటవీ ప్రాంతంలో జరిగిన పోరులోనూ పాల్గొన్న ఆయన .......ఉగ్రతూటాలకు నేల కొరిగారు. కానీ, ఒక్కడిగా కాదు.........తనతోపాటు తలపడిన ఉగ్రమూకలోని నలుగురిని చంపి వీరమరణం పొందారు. 11 రోజుల్లో మూడు ఆపరేషన్లలో పాల్గొని పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆయన దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసారు.

మోహన్ నాథ్ గోస్వామికి భార్య, ఏడేళ్ళ కూతురు ఉన్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved