వయసు ఎక్కువగా కనపడుతోందా?

ఈ ఆధునిక కాలంలో యువతీ యువకుల జీవన శైలి మారింది. ఉద్యోగరీత్యానో.. లేక ఏదైనా పనులలో పడైనా ఆహారాలను సక్రమంగా తీసుకోలేక పోతున్నారు. మరి కొందరు వారికున్న బిజీ లైఫ్ లో జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిపోతున్నారు.

అందువల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోలేక… లావుగానో, ఊబకాయులుగానో మారుతున్నారు. ఫలితంగా చిన్న వారు కూడా పెద్ద వయసు ఉన్న వాళ్లలాగా కనపడుతున్నారు. అయితే కొన్ని కొన్ని ఆహారపదార్ధలను తీసుకోవడం ద్వారా పెద్దవారు కూడా వయసును తగ్గించుకోవచ్చని… చిన్నవయసు వారుగా కనపడవచ్చని నిపుణులు అంటున్నారు.

వయస్సు కనపడకుండా కాపాడే ఆహారపదార్ధాలేంటో మనమూ తెలుసుకుందాం.

• దాల్చిన చెక్క పొడి… చర్మసౌందర్యానికి చాలామంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఈ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా వయసును తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. అంతేకాక దాల్చినచెక్క పొడిని వాడడం వల్ల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని అంటున్నారు.

• జీర్ణక్రియ పని తీరును పెంచే శక్తి కొబ్బరి నూనెకు ఉంది. జీర్ణక్రియ పెరగడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాక కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలు బలంగా తయారవుతాయి. దాని వల్ల వయసు తక్కువగా కనపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

• సబ్జా గింజల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు.. చర్మం, మెదడు, గుండె మొదలైన వాటి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. తద్వారా చర్మం యూత్ ఫుల్ గా కనిపిస్తుందని చెబుతున్నారు. అంతేకాక సబ్జా గింజల్ని నానబెట్టుకొని తినడం వల్ల శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved