వాడవాడలా వెలసిన గణేశ్.. మారుమోగుతున్న గణేశ్ నామస్మరణ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఖైరతాబాదులో కొలువుదీరిన వినాయకుడి భారీ విగ్రహానికి సతీసమేతంగా పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు వచ్చిన గవర్నర్ దంపతులు అక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి తొలి పూజలు చేయడం తో నగరంలో గణేశ్ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లో వాడవాడలా వెలసిన గణేశ్ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం పలికారు. ప్రస్తుతం హైదరాబాదులో గణేశ్ నామస్మరణ మారుమోగు తుంది.

ఇదిలా ఉండగా గణనాథుడి ఎత్తు విషయంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న పోకడలు కనిపిస్తున్నాయి. 'పొల్యూషన్ ఫ్రీ'.. 'ఎకో ఫ్రెండ్లీ' చర్యల్లో భాగంగా ఇకపై ఏటా అడుగు మేర గణనాథుడి ఎత్తును తగ్గించాలని ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించగా ఏటా అడుగు మేర ఎత్తు తగ్గిస్తూ గణనాథుడి ఎత్తును 5 అడుగులకు తీసుకొస్తారట. విగ్రహం ఎత్తు ఐదడుగులకు చేరుకున్న తర్వాత మట్టికి బదులు 'పసిడి'తో వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తారట. కాగా విశాఖ, విజయవాడల్లో ఏటేటా గణేశుడి ప్రతిమ ఎత్తు పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఎత్తు 82 అడుగులుంది.

వినాయకచవితి శుభాకాంక్షలు!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved