విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 160 మందిని కాల్చివేత

ఫ్రాన్స్ రాజధాని సుందర నగరం ప్యారిస్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాద దాడుల్లో సుమారు 160 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వంద మంది పౌరులను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. ప్యారిస్ స్థానిక కాలమాన ప్రకారం నిన్న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో నగరంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్దారు. జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తిమంతమైన పేలుళ్లు జరిపారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 160 మందికి పైగా అయామక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తుంది.

ఉగ్రవాదులు పౌరులను నిర్బంధించిన బాటాక్లాన కాన్సర్ట్‌హాలును భద్రతాదళాలు ముట్టడించాయి. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన ఫ్రెంచ్ బలగాలు దేశం సరిహద్దులను మూసివేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ దాడి తమ పనేనని కొద్దిసేపటి క్రితం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ప్రస్తుతం ప్యారిస్ లో కాల్పులు జరిగిన ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పారిస్ లో ఉగ్రవాదుల దాడులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved