వెంకన్నకు 4కోట్లు విరాళం

ఆస్తిని రెట్టింపు చేసుకునే ఈ రోజుల్లో.. ఆస్తిని శ్రీవారికి రాసిచ్చేందుకు ఓ వృద్ధురాలు ముందుకొచ్చారు. అదీ.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు కోట్లు. చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవటంతో.. తన ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇచ్చేందుకు ఆస్తు లకు సంబంధించిన పత్రాలతో తిరుమల వచ్చా రు. లేవలేని స్థితిలో ఉన్న ఆమె, చేయి విరిగి కట్టుకట్టుకొని టీటీడీ రెవెన్యూ అధికారులకు ఆస్తి పత్రాలను ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. తనపై ఉన్న ఆస్తి అన్యాక్రాంతమవుతోందని.. కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇతరులకు పోకుండా, ఇష్టదైవమైన శ్రీవారి పాదాల చెంత ఉంచి, తుదిశ్వాస విడుస్తానని చెప్పారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved