వ్యాయామం చేస్తే మొబైల్ ఛార్జ్ అవుతుంది... సరికొత్త చార్జింగ్ డివైజ్ !

రోజుకో టెక్నాలజీ వస్తోంది. ఆ టెక్నాలజీ వలన చాల వరకు లాభపడుతున్నాం. మొదట కరెంట్ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ పెట్టడం కష్టమయ్యేది. తరువాత పవర్ బ్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా యాంపి అనే కంపెనీ ఒక సరికొత్త చార్జింగ్ డివైజ్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. మొబైల్, ఐపాడ్‌లు చార్జింగ్ నిమిత్తం ఉపయోగించే ఈ పరికరానికి విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన నుంచే. ఎట్లా అంటే... మొదట, ఈ డివైజ్ ను మన శరీరానికి అమర్చుకోవాలి. నడవటమో, పరిగెత్తడమో, ఇట్లా ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం ద్వారా మన శరీరం నుంచి గతిజశక్తి విడుదల అవుతుంది. ఈ శక్తిని విద్యుత్ శక్తిగా ఈ డివైజ్ మార్చుకుంటుంది. తద్వారా ఆ పరికరంతో మొబైల్, ఐ పాడ్ వంటి పరికరాలను చార్జింగ్ చేసుకోవచ్చు. చాల బాగుంది కాదు... ఇప్పుడు ఛార్జింగ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ తక్కువ ఉంటే ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలు ఛార్జింగ్ తో పాటు ఆరోగ్యం కుడా..


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved