శవం తలదగ్గర దీపం ఎందుకు ?

హిందూ ధర్మం లో దీపం ఒక అద్బుతమయిన జ్ఞాన చిహ్నం. ప్రతి ఇంట్లోను దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న హైందవ ఆచారం. కొన్ని ఇళ్ళలో నిరంతరం వెలగుతుంది, దానినే అకండదీపం అంటారు . అన్ని పవిత్ర సమయాల్లో దీపం వెలిగించడం అనే సాంప్రదాయం తప్పనిసరి. పవిత్ర సమయం లోనే కాదు ఒక వ్యక్తి చనిపోయి శవం గా మారినప్పుడు కూడా అతని తలదగ్గర దీపాన్ని వెలిస్తారు. దానికి కారణం శవం చీకటి ఉండరాదనే నియమం వలన. మరి రాత్రి పూట అంటే చీకటి వుంటుంది .. మరి ఉదయం సూర్యరశ్మి కాంతి లో వున్నప్పుడు , చీకటి ఉండదు కదా ? మరి ఉదయం కూడా ఎందుకు వెలిస్తారు ? దీనికి కూడా ఒక అద్బుతమైన వివరణ ఉంది .

మనిషి బ్రతికి వున్నప్పుడు , దీపం మనిషికి కారు చీకటిలో కూడా దారి చూపుతుంది, చనిపోయిన తర్వాతకూడా దీపం మనిషి మోక్ష మార్గం చూపుతుంది.చనిపోయిన తర్వాత ఆత్మ బ్రహ్మ కపాలం ద్వారా బయటకు వస్తేనే ఆత్మకు మోక్షమార్గం దొరుకుతుందట. బ్రహ్మ కపాలం నుండి శరీరం నుండి బయటికి వచ్చిన ఆత్మ మోక్షమార్గం చేరేందుకు రెండు మార్గాలు ( ఉత్తర , దక్షణ ) ఉంటాయట. దక్షణ మార్గం లో పూర్తిగా చీకటి,ఉత్తర మార్గం లో వెలుగు ఉంటుందట.బయటకు వచ్చిన ఆత్మ కు తలపక్కన ఉన్న దీపం ఉత్తర దిక్కుగా వెళ్ళమని దారి చూపేందుకు సహాయం చేస్తుందట.చూసారా హైందవ ధర్మం ఎంత గొప్పదో , ప్రతి ప్రశ్నకు అర్ధవంతమయిన సమాదానం ఇచ్చేదే మన పవిత్ర హైందవ ధర్మం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved