ఆ గుళ్లో శివలింగం కదులుతుందట!

శివలింగం కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిజమేనండి. ఉత్తరప్రదేశ్, దియోరియా జిల్లాలోని రుద్రపురంలోని ఓ శివాలయంలో శివలింగం కదులుతూ ఉంటుందని అక్కడి అర్చకులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అని, ఈ శివుడిని దుగ్దేశ్వరనాధుడు అంటారని చెబుతున్నారు. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం కదిలితే రోజంతా కదులుతూనే ఉంటుందని లేకపోతే ఎవరు కదిపినా కదలదని అంటున్నారు.

ఈ శివలింగాన్ని పానమట్టము మీద కాకుండా భూమి మీదనే ప్రతిష్టించారట. స్వామివారు కదులుతున్న సమయంలో దర్శనకోసం ప్రజలు బారులు తీరుతారట. ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నదో తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట అధికారులు. దేవుడి లీలలో ఇదీ ఒకలీలగా పరిగణిస్తున్నారు అక్కడి స్ధానికులు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved