850 మంది ప్రాణాలు కాపాడిన 10 ఏళ్ల పిల్లవాడు..!

ఆ బుడ్డడి పేరు సిద్దేష్. వయస్సు 10 ఏళ్ళు. అతడి తండ్రి టీస్టాల్ నడుపుతూ ఉంటాడు. రోజూలాగే టీస్టాల్ నడిపే తన తండ్రికి సహాయం చేసేందుకు రైల్వే ట్రాక్ దాటుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్న సమయంలో రైలు పట్టాలు ఊడిన దృశ్యాన్ని గమనించి.. వెంటనే తన తండ్రికి చెప్పాడు. సిద్దేశ్ తండ్రి, ఆ ఊరి ప్రజలు ఆ ట్రాక్ దగ్గరికి వచ్చి చూస్తుండగానే.. అదే ట్రాక్ పై భారీ శబ్దం చేసుకుంటూ హరిహర- చిత్రాగద ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది. ప్రమాదం ముంచుకు వస్తోందని గమనించిన ఊరి ప్రజల్లో ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా ఎర్రటి వస్త్రం ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపవచ్చు అని అన్నాడు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న సిద్దేశ్ ట్రైన్ కి ఎదురుగా పరుగెత్తాడు.

సిద్దేశ్ ధరించిని టీ-షర్ట్ ఎరుపు రంగులో ఉండడంతో.. వెంటనే ఆ టీ-షర్ట్ ను ఒంటిపై నుండి తీసి, గాలిలో ఊపుకుంటూ రైలు ఎదురుగా పరుగుతీశాడు. సిద్దేశ్ వెంటనే అతని తండ్రి, ఊరి ప్రజలు పరుగుతీశారు. ఇది గమనించిన రైలు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి, రైలును ఆపాడు. అప్పటికి ఆ రైలులో 850 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. జరిగిన విషయం తెలిసి అందరూ షాక్ తిన్నారు. సిద్దేష్ కు మా ప్రాణాలు కాపాడడానికి దేవుడు పంపిన ధూతవు రా నువ్వు అంటూ దండం పెట్టారు.

ఈ సాహసం కారణంగానే సిద్దేష్ కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చిల్డ్రన్స్ డే నాడు ధైర్యశాలి అవార్డ్ అందించింది. అవార్డు అందుకున్న సమయంలో సిద్దేశ్ చెప్పిన మాటలు వింటే నిజంగా చప్పట్లు కొట్టకుండా ఉండలేం. నిండా 10 యేళ్ళు కూడా నిండని ఈ బుడతడు ఏమన్నాడో తెలుసా..? ”ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలని అనుకున్నా.. ప్రయాణికుల్ని కాపాడాలనే నా మనసుల గట్టిగా అనుకున్నా. అందుకే ఆ సమయంలో ఎటువంటి భయం కలగలేదు” అని అన్నాడు. అతను చెప్పిన మాటలకు సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved