సిరియాలో ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్, రష్యా ముప్పేట దాడి

సిరియాలోని ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్, రష్యా విరుచుకుపడుతున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలతో దాడులు చేశాయి. పారిస్‌లో ఉగ్రవాదుల మారణకాండకు 129 మంది బలయ్యారు. దీనికి ప్రతీకారంగా ఉత్తర సిరియాలోని ఐఎస్ శిక్షణ స్థావరాలపై దాడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆదేశించారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై పోరాటంలో తమకు సహకరించాలని అమెరికా, రష్యాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ను కోరారు. 26 ఈయూ దేశాలు తమ సమ్మతి తెలిపాయి. దాడులకు సహకరించాలని బ్రిటన్ భావిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్ అభ్యర్థనకు రష్యా వెంటనే స్పందించింది. సిరియాలోని ఐఎస్ కీలక స్థావరాలపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇటీవల ఈజిప్టులోని సినాయ్ ద్వీప కల్పంలో తమ విమానం కూలడానికి ఉగ్రవాదులు పెట్టిన బాంబే కారణమని రష్యా నిర్థారించింది. ఐఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. 224 మంది ప్రయాణికుల మృతికి కారణమైన వారి సమాచారం అందించిన వారికి 50 మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తామని రష్యా ప్రకటించింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved