ప్రతీకారంతో విరుచుకు పడుతున్న ఫ్రాన్స్.. విమానాలతో సిరియా పై బాంబుల వర్షం

రెండు రోజులక్రితం తమ దేశంపై జరిగిన ఉగ్రదాడికి ఫ్రాన్స్ ప్రతీకారంతో విరుచుకు పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున.. 10 యుద్ధవిమానాలు యూఏఈ, జోర్డాన్ దేశాల్లోని బేస్ ల నుంచి సిరియావైపు దూసుకెళ్లి.. ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయని భావించిన చోటుల్లో బాంబుల వర్షం కురిపించాయి. మొత్తం 20 శక్తిమంతమైన బాంబులను జార విడిచినట్టు ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలుపగా.. అమాయకులే అత్యధికంగా మరణించారని సమాచారం.

సిరియాలో ఓ ఫుట్ బాల్ స్టేడియం, ఓ మ్యూజియం, ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో 30కి పైగా బాంబులు పడ్డాయని తెలుస్తుంది. 2 లక్షల మందికి విద్యుత్ సరఫరా అందించే కేంద్రం పేలిపోయిందని తెలుస్తుంది. ఎంతమంది మరణించారన్న విషయం సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఫ్రాన్స్ దేశాన్ని గడగడలాడించే విధంగా ఉగ్రదాడి జరగడం వెనకున్న ప్రధాన సూత్రధారుడి గురించిన సమాచారం ఆ దేశ భద్రతా దళాలకు తెలిసింది. బ్రసెల్స్‌లో జన్మించిన అబ్దెస్లాం సలా (26) అనే వ్యక్తిని అత్యవసరంగా గుర్తించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఫ్రెంచి పోలీసులు వెల్లడించారు. ఫ్రాన్స్ పై దాడి కుట్ర యావత్తూ బెల్జియంలోనే జరిగిందని.. ఉగ్రవాదుల మూలాలను కనుగొనడానికి యూరప్ దేశాల్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయని ఫ్రాన్స్ హోం మంత్రి తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved