ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫి వీడియో సోషల్ మీడియాలోనూ ఈ సూసైడ్ సెల్ఫి వీడియో హల్ చల్ చేస్తోంది

గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన నాగేశ్వర రావు, బాపట్లకు చెందిన వరలక్ష్మీకి పెళ్లి జరిగింది. ఏడాది క్రితం వరలక్ష్మికి కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో అమె సికింద్రాబాద్ లో విధులు నిర్వహిస్తోంది. నాగేశ్వరరావు కుడా కరాటే క్లాసులు చెప్తూ జీవనం సాగిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న వారి సంసార జీవితంలో అక్రమ సంబంధం వివాదాలకు ఆజ్యం పోసింది.

సంతోష్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడి తన భార్య నిత్యం అతనితో ఛాటింగ్ చేస్తుందన్న అనుమానం నాగేశ్వర రావు మదిని తొలచింది. అది భరించలేకపోయిన నాగేశ్వరరావు సెల్ ఫోన్ లో సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సికింద్రాబాద్ లోని బాన్సీలాల్ పేటలో కలకలం రేగింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ సూసైడ్ సెల్ఫి వీడియో హల్ చల్ చేస్తోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved