హెల్మెట్‌ నిబంధనకు అనూహ్య స్పందన

సుప్రీం కోర్టు తీర్పుతో వాహనదారుల్లో భయం హెల్మెట్‌ ధరించిన 60శాతం మంది వాహనదారులు తొలి రోజు 350 కేసులు

హెల్మెట్‌ తప్పనిసరి చేయడంపై నగరంలో గురువారం వాహనదారులలో మంచి స్పందన కనిపించింది. దాదాపు 60 శాతం పైబడి వాహనదారులు హెల్మెట్‌ ధరించారు. రవాణా శాఖ అధికారులు కూడా ఈ పరిణామాన్ని ఊహించలేకపోయారు. గతంలో హెల్మెట్‌ తప్పనిసరి పేరుతో డ్రైవ్స్‌ నిర్వహించిన సందర్భాల్లో కంటే ఈసారి హెల్మెట్‌లు ధరించిన వారి సంఖ్య పెరిగింది. హెల్మెట్‌ ధరించని వారిని న్యాయపరంగా ప్రాసిక్యూషన చేయించేందుకు పూనుకోవటంతో వాహనదారులలో భయం వచ్చింది. సుప్రీం కోర్టు కూడా కేంద్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఈ కమిటీ ద్వారా అన్ని రాష్ర్టాలలో ప్రతి జిల్లాలోనూ హెల్మెట్‌ అమలు తీరుపై సమీక్షించనుండటం, ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుండటంతో వాహనదారులు కూడా భయపడ్డారు. గతంలో ప్రజా ప్రతినిధులు, డీజీపీ గందరగోళ ప్రకటనల నడుమ మూడు సార్లు హెల్మెట్‌ తప్పనిసరి నిర్ణయం వాయిదా పడింది. సుప్రీం ఆదేశాలతో భయంతోనే వాహనదారులు హెల్మెట్‌లను కొనుగోలు చేశారని రవాణాశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ముమ్మర తనిఖీలు - కేసుల నమోదు

తొలిరోజు రవాణా శాఖ అధికారులు హెల్మెట్‌ ధారణపై నగరంలో మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆర్టీవో పురేం ద్ర పర్యవేక్షణలో ఈ మూడు బృందాలు తొలి రోజు దాదాపుగా 350 కేసులను నమోదు చేశాయి. హెల్మెట్‌ ధరించని వారి వాహనాలను నిలుపుదల చేసి డ్రైవింగ్‌ లైసెన్స, వెహికల్‌ రిజిస్ర్టేషన్స పరిశీలించారు. హెల్మెట్‌ ఎందుకు కొనలేదన్న దానిపై ప్రశ్నించారు. హెల్మెట్‌ వినియోగించని వాహనదారులకు హెల్మెట్‌ అవసరంపై అవగాహన కల్పించారు. తొలిసారిగా వాహన దారుల నుంచి రూ. 100 చలానా రూపంలో జరిమానా వసూలు చేశారు.

నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు

వాహనదారులు హెల్మెట్‌ ధారణపై శక్రవారం నుంచి నిరవధికంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించనున్నారు. ప్రధాన కూడళ్ళతో పాటు అంతర్గత రోడ్ల జంక్షన్లలో కూడా మాటు వేసి వాహనదారులను తనిఖీ చేయనున్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులందరినీ రవాణా శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్ళి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇది ఒక రకంగా వాహనదారులకు పరీక్ష వంటిదేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన వారు పూర్తి విషయాలు తెలుసుకోవటంతో పాటు మరోమారు రావటానికి ఇష్టపడరని భావిస్తున్నారు.

ముమ్మర తనిఖీలు - కేసుల నమోదు తొలిరోజు రవాణా శాఖ అధికారులు హెల్మెట్‌ ధారణపై నగరంలో మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆర్టీవో పురేం ద్ర పర్యవేక్షణలో ఈ మూడు బృందాలు తొలి రోజు దాదాపుగా 350 కేసులను నమోదు చేశాయి. హెల్మెట్‌ ధరించని వారి వాహనాలను నిలుపుదల చేసి డ్రైవింగ్‌ లైసెన్స, వెహికల్‌ రిజిస్ర్టేషన్స పరిశీలించారు. హెల్మెట్‌ ఎందుకు కొనలేదన్న దానిపై ప్రశ్నించారు. హెల్మెట్‌ వినియోగించని వాహనదారులకు హెల్మెట్‌ అవసరంపై అవగాహన కల్పించారు. తొలిసారిగా వాహన దారుల నుంచి రూ. 100 చలానా రూపంలో జరిమానా వసూలు చేశారు.

నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు

వాహనదారులు హెల్మెట్‌ ధారణపై శక్రవారం నుంచి నిరవధికంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించనున్నారు. ప్రధాన కూడళ్ళతో పాటు అంతర్గత రోడ్ల జంక్షన్లలో కూడా మాటు వేసి వాహనదారులను తనిఖీ చేయనున్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులందరినీ రవాణా శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్ళి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇది ఒక రకంగా వాహనదారులకు పరీక్ష వంటిదేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన వారు పూర్తి విషయాలు తెలుసుకోవటంతో పాటు మరోమారు రావటానికి ఇష్టపడరని భావిస్తున్నారు.

ముమ్మర తనిఖీలు - కేసుల నమోదు

తొలిరోజు రవాణా శాఖ అధికారులు హెల్మెట్‌ ధారణపై నగరంలో మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆర్టీవో పురేం ద్ర పర్యవేక్షణలో ఈ మూడు బృందాలు తొలి రోజు దాదాపుగా 350 కేసులను నమోదు చేశాయి. హెల్మెట్‌ ధరించని వారి వాహనాలను నిలుపుదల చేసి డ్రైవింగ్‌ లైసెన్స, వెహికల్‌ రిజిస్ర్టేషన్స పరిశీలించారు. హెల్మెట్‌ ఎందుకు కొనలేదన్న దానిపై ప్రశ్నించారు. హెల్మెట్‌ వినియోగించని వాహనదారులకు హెల్మెట్‌ అవసరంపై అవగాహన కల్పించారు. తొలిసారిగా వాహన దారుల నుంచి రూ. 100 చలానా రూపంలో జరిమానా వసూలు చేశారు.

నేటి నుంచి ఆకస్మిక తనిఖీలు

వాహనదారులు హెల్మెట్‌ ధారణపై శక్రవారం నుంచి నిరవధికంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించనున్నారు. ప్రధాన కూడళ్ళతో పాటు అంతర్గత రోడ్ల జంక్షన్లలో కూడా మాటు వేసి వాహనదారులను తనిఖీ చేయనున్నారు. హెల్మెట్‌ ధరించని వాహనదారులందరినీ రవాణా శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్ళి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇది ఒక రకంగా వాహనదారులకు పరీక్ష వంటిదేనని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన వారు పూర్తి విషయాలు తెలుసుకోవటంతో పాటు మరోమారు రావటానికి ఇష్టపడరని భావిస్తున్నారు.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved