నిన్ను సృష్టించింది బ్రహ్మ అయినా.., నిన్ను నవ మాసాలు మొసి.., ప్రాణం పోయే పరిస్థితిలో కూడా.., ఏ మనిషి అనుభవించలేనంత బాధను భరిస్తూ.., నీకు ప్రాణం పోసి.., ఈ భూమి పైకి తీసుకు వచ్చి.., ఎర్రని తన రక్తాన్ని తెల్లని పాలుగా ఇచ్చి.., నిన్ను ఇంతవాడిన చేస్తే.., అందుకు నీవు చూపే కృత జ్ఞాత.., ఇచ్చే ప్రతిఫలం.., ఆ తల్లినే గౌరవించకపోవడమా..? తిట్టడమా..? కొట్టడమా..? చంపడమా..? నీవు బ్రతికి వుండగానే తనని అనాథను చేయడమా..? లేక తల్లిని భర్య బిడ్డల కు దాసిని చేయడమా..? తన పాల కోసం ఏడ్చి.., తన లాలన పాలన కై ఏడ్చి.., ఈనాడు తననే కన్నీటి పాలు చేసి ఆనందిస్తున్నావా..? గుర్తుపెట్టుకో..!! రేపటి రోజున నీ బిడ్డలు నీకు అదే స్థతిని కలిపిస్తే.., ఆ రోజున నిన్ను చూసి నవ్వదు నీ తల్లి..! నీ పరిస్థితికి బాధపడుతుంది..!! నిన్ను ఓదార్చి పోషించటానికి కష్టపడుతుంది..! అటువంటి తల్లిని కన్నీటి పాలు చేయకు..!!

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved