90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్ళు నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యలవల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువమందిలో కనిపించేదీ… అలస్యం చేస్తే ప్రమాదకరమైనదీ .

ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ నొప్పిని నివారించవచ్చని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు. అవేంటో ఇక్కడ పరిశీలిద్ధాం.

వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాల్ని ముందుకు కుంచించడం కాకుండా పొడవుగా శరీరం కిందకు జరపాలి. కడుపు భాగం లోపలికి జరగాలి. శరీరం భారీకాయంగా ఉండి ఎక్కువ బరువు ఉంటే వెన్ను మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. అందుకని ఆహార నియమాల్ని పాటిస్తూ శరీరానికి తగ్గ బరువును కలిగి ఉండాలి. ఆహారంలో కొవ్వు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

కుక్కి మంచాల మీద కాకుండా గట్టిగా ఉండే మంచాలపై పడకోవాలి. మంచం మీద పడుకోబోయే ముందు, లేచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఉదుటున కాకుండా నిదానంగా లేవడం, నిదానంగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తల కింద దిళ్లు మరీ ఎత్తుగా ఉండకుండా చూసుకోవాలి.

నల్లమందు రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అలామీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved