అందరికీ షేర్ చేయండి

ముంబైలో జరిగిన సంఘటన

ఒక వ్యాపారవేత్త కుమార్తె అయిన మధుమిత, తన స్నేహితురాలి బర్త్ డే పార్టీ నుండి ఇంటికి వెళుతూ, తన కారుకు పెట్రోల్ పట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళింది.

ఆమె పెట్రోల్ పట్టించుకొని, కారు స్టార్ట్ చేసే సమయంలో , చాలా చక్కగా డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి " మీ ఇంటికి పెయింటింగ్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్ గానీ ఏదైనా ఉంటే మాకు కాల్ చేయండి మేడమ్ " అంటూ ఒక విజిటింగ్ కార్డును ఆమెకిచ్చాడు.

విజిటింగ్ కార్డే కదా అని ఆమె మొహమాటం కొద్దీ దానిని చేతిలోకి తీసుకొని, తన ప్రక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.

కొద్దిదూరం కారు లో ప్రయాణించిన తర్వాత ఆమె కళ్ళకు ఏదో మబ్బులుగా అడ్డు పడుతున్నట్లుగా, దాహం వేస్తున్నట్లుగా , శరీరమంతా నలతగా అయిపోతుండటంతో , కారును సైడు తీసుకొని ఓ వైపుగా ఆపుకుంది.

ఎవరైతే విజిటింగ్ కార్డు ఇచ్చారో, ఆ గ్యాంగ్ వాళ్ళు తన కారును ఫాలో చేస్తున్నారనే విషయం ఆమె గమనించలేదు.

ఎప్పుడైతే ఆమె కారును ప్రక్కన ఆపి , మత్తులోకి జారుకుందో, వారు ఆమెపై అఘాయిత్యం చేసి డబ్బు,సొమ్ములన్నీ దోచుకెళ్ళారు.

మరునాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా,

వారు దర్యాప్తు చేసి, ఆమెకిచ్చిన విజిటింగ్ కార్డుపై ఒక విధమైన మత్తు మందును చల్లడం వల్ల , ఆమె దాన్ని చేతిలోకి తీసుకున్న కొద్దిసేపటికి నెమ్మది నెమ్మదిగా మత్తులోకి జారుకుందని తేల్చారు.

కాబట్టి, పెట్రోల్ బంకుల వద్ద ఎవరైనా అపరిచితులు విజిటింగ్ కార్డులను ఇస్తే , వాటిని చేతులతో తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది.

మీ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని తెలియజేసి జాగ్రత్త పరచండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved