మనలో కొందరు ధనవంతుల ఇళ్ళలో పుడతారు ఇంకొందరు మధ్య తరగతి ఇళ్ళలో పుడతారు మరికొందరు పేదరికంలో పుడతారు. వారి వారి స్థాయిలను బట్టి, ప్రతి ఒక్కరికీ బాధలు ఉంటాయి. సమస్యలు కూడా ఉంటాయి. కానీ, ధనవంతుల జేబులో ఉన్న ఓ వేయి రూపాయలలో, ఒక వంద రూపాయలను పేదలను ఆపదలో ఆదుకోవడానికి ఉపయోగిస్తే, పేదల బాధలు చాలా వరకు తగ్గుతాయి. అదే విధంగా, మధ్య తరగతి వారి జేబులో ఉన్న ఓ వంద రూపాయలలో , ఒక పది రూపాయలను నిరుపేదల కడుపు నింపడానికి ఉపయోగిస్తే, వారి ఆకలి బాధలు చాలా వరకు తీరుతాయి. మనుషులలో మనుషుల పట్ల ఆత్మీయతలు, అనురాగాలు పెరుగుతాయి. నేటి సమాజం మానవత్వపు పరిమళాలతో విలసిల్లుతుంది. - గోపిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved