తరాలు తిన్నా తరగని ధనముంది

ఎదటి మనిషిని ఎదిరించే ధైర్యముంది

ముప్పొద్దులా ఘుమఘుమలాడే తిండుంది

విశ్వకర్మే విస్తుపోయేంతటి భవనముంది

ఊరంతా గొప్పగా చెప్పుకునే పేరుంది

అందరూ జేజేలు పలికే ప్రఖ్యాతుంది

ఇంట్లో ఎదురూచూసే భార్య ఉంది

మురిపించి మరపించే సంతానముంది

తప్పు చేస్తామని చూచే సంఘముంది

పలకరిస్తే పులకరించే స్నేహముంది

అనుభూతుల్ని దాచుకొనే మనస్సుంది

అంతరిక్షంలోకి ఎగరగలిగే విఙ్ఞానముంది

కానీ వస్తూ..పోతూ..

మనతోనే ఉన్నట్టనిపిస్తూ..

అంతలోనే మాయమైపోతూ..

ఉన్నదని భ్రమించేలోపే లేదన్న చేదు నిజాన్ని తెలియజేస్తూ

ఎండమావిలాంటి అందమైన "ఆనందం", జీవితంలో అచ్చంగా మన సొంతమౌతుందా?

****************************************

"ఎందుకు లేదు…ఎప్పుడూ నేను ఏ టెన్షన్సు లేక ఆనందంగానే ఉంటానే" అంటారా…అలా అనే వాళ్ళకు నా శతకోటి అభినందనలు. జన్మ జన్మల పుణ్యఫలం మీ ఆనందం. అలాగే ఉండండి…నలుగురునీ అలాగే ఉంచండి.

****************************************

మొన్న కొత్తపాళీగారు తమ బ్లాగులో "జీవిత పరమార్థం" గురించి అడిగినప్పుడు దాదాపు అందరూ "ఆనందం"గా ఉండటమే అని సమాధానం వ్రాశారు. మనకు ఆనందంగా ఉండటం ముఖ్యం అని తెలుసు, కానీ ఎలా ఉండాలో తెలియదు.

జీవతమంతా ఆనందంగా ఉండాలని లేనిదెవ్వరికి?

మీ ఇంటి వెనక ఓ పెద్ద గొయ్యి ఉందనుకొందాం. చిన్నప్పట్నుంచి రోజూ కొంత చెత్త వేస్తూ వస్తున్నారనుకుందాం. పెద్దయ్యే పాటికి ఆ గొయ్యి ఏమౌతుంది? చెత్తతో నిండిపోదూ? అసలు ఆ చెత్తను పొయ్యడానికి 'పెద్ద' గొయ్యి అయినా సరిపోతుందా? సరిపోదు, మనమే వీలైనప్పుడంతా ఆ చెత్త తీసేస్తూ మునిసిపాలిటీ ట్రాక్టర్లో వేస్తూ ఉండాలి, అప్పుడే గొయ్యి ఖాళీగా ఉండి…ఏ వర్షమో పడ్డప్పుడు నీళ్ళు నిండుతాయి…భూమి దాహాన్ని తీరుస్తాయి. మన మనస్సు కూడా సరిగ్గా గొయ్యి లాంటిదే. చిన్నప్పట్నుంచి చెడు ఆలోచనలు, తప్పు ఆలోచనలు (negative thinking) అనే చెత్తను మన మనస్సనే గొయ్యిలో వేస్తూనే ఉన్నాం? మరి ఆనందమనే వర్షానికి వచ్చే నీరు నింపుకోవడానికి…అనుభూతి చెందటానికి మన మనస్సులో ఖాళీ ఏది? మనలోనే ఎన్నో వికారాలను నింపుకొని మన ఆనందాని మనమే చిదిమేసుకుంటాం. అసలు మనం ఆనందంగా ఉండాలంటే మొదటి మెట్టు మనలో లోపాలు ఉన్నట్టు మనం తెలుసుకోవడం, మనం పరివర్తన చెందాలన్న బలీయమైన కోరిక కలగడం. సదా ఆనందంగా ఉండాలంటే, మనలో కొన్ని గుణాలు నింపుకోవాలి, అలవాట్లు చేసుకోవాలి. ఆనందంగా ఉండటానికి నా అనుభవం నేర్పిన ఓ పది పాఠాలను మీతో పంచుకుంటున్నాను.

1) అందరిలోని మంచినే చూస్తూండాలి

2) సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి

3) చెడులో కూడా మంచినే చూడాలి

4) వ్యర్థాన్ని సమర్థంగా చేసుకోవాలి

5) నిందా స్థుతులలో ఒకటిగా ఉండాలి

6) సహనశీలతా గుణం చాలా మంచిది

7) అపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి

8) సమస్యలు మనలను వదలవు, మనమే వాటిని వదిలెయ్యాలి

9) అందరి స్వభావ సంస్కారాలతో కలసిపోవాలి. (Flexible and adaptable)

10) మాట మధురంగా ఉండాలి

Stephen Covey 8th habbit లాగా, పైన వ్రాసిన ఒక్కో వాక్యం గురించి ఒక్కో పుస్తకం వ్రాయొచ్చు. పుస్తకం


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved