ఈ ప్రపంచంలో కొందరు ఏదో బ్రతికేద్దాం ........అని బ్రతికేస్తుంటారు. ఇంకొందరు తమ జీవితాలకు ఓ అర్థం ఉండేలా కొన్ని రకాల ఆశయాలతో , లక్ష్యాలతో జీవిస్తుంటారు.

ఈ ఫోటోలోని వ్యక్తి పేరు బగీచా సింగ్ . అతను కన్యాకుమారి నుండి హర్యానాకు పాదయాత్ర చేస్తున్నాడు. అవినీతికి వ్యతిరేకంగా , మద్యపానం , ధూమపానం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని వివరిస్తూ ఇప్పటివరకు 21 సార్లు ఇతను పాదయాత్ర చేసాడు. 1992 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు అలుపెరుగని పాదయాత్ర చేస్తున్న ఈ బాటసారి , తనతో పాటు 80 కే.జీ. ల బరువును మోస్తూ మన భారత జాతీయ పతాకాలను ఎల్లప్పుడూ తనతో ఉంచుకుంటూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఒక మంచి ఆశయంతో నడక సాగిస్తున్న బగీచా సింగ్ గారికి హ్యాట్సాఫ్.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved