మరణాన్ని ముందే గుర్తించిన కలాం?

తన జీవన యానానికి ఇక ముగింపు పలకనున్నానని, తనకు ‘కౌంట్‌ డౌన్‌’ ప్రారంభమైందని కలాం ముందుగానే గుర్తించారా? కలాంతో 33 ఏళ్లపాటు సన్నిహితంగా మెలిగిన ఆయన సహాయకుడు, పుస్తక రచనలో సహకారం అందించిన అరుణ్‌ తివారీ ఔననే చెబుతున్నారు. కలాం తాజా పుస్తకం ‘ట్రాన్సెండెన్స్‌’లో తాత్వికపరమైన ప్రకటన చేశారన్నారు. ఆ పుస్తకంలోని 50 పుట రెండో పేరాలో ‘చివరకు ప్రముఖ స్వామీజీ నన్ను భగవంతుడి సమతుల్య కక్ష్యలోకి నెట్టారు. ఇక ఎలాంటి యుక్తులు అవసరంలేదు. శాశ్వతమైన అంతిమ స్థితికి నన్ను చేర్చారు’ అని పేర్కొన్నారు. ఆ మాటలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని, ఇప్పుడు ఆ పంక్తులను చదువుతుంటే ఆయన ముందస్తుగా ఏదో హెచ్చరించినట్లే ఉందని చెప్పారు. ఈనెల 20న గుజరాత్‌లోని సారంగపూర్‌లో ప్రముఖ్‌ స్వామీజీకి ఆ పుస్తకాన్ని అందజేసిన తర్వాత తిరుగు పయాణంలో కారులో తమ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సంభాషణ కూడా అదే భావనను కలిగించిందన్నారు. అలాగే, పది రోజుల కిందట తన మనవరాలితో మాట్లాడుతూ ‘ఇక నేను నీ దగ్గరికి రాను, నీవే నా దగ్గరికి రావాలి’ అ న్నారని, అంతిమ సమయం ఆసన్నమైన విషయం కలాంకు ముందే తెలిసి ఉం టుందని అభిమానులు నమ్ముతున్నారు.

More About KALAM

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved