రైలు ప్రమాదంలో 30 మంది మృతి

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

పలువురు కొట్టుకుపోతుండగా చూశామన్న సాక్షులు

మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. 

మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో పలువురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలామంది నీళ్లలో కొట్టుకుపోతుండటం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. 

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలతో పలు రైళ్లు నిలిపివేత

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. ముంబయి, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి వచ్చే రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్‌-కోట మీదుగా మళ్లించారు. హర్దా వద్ద మూడు రైళ్లను రద్దు చేశారు. 25 రైళ్లను దారిమళ్లించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఎంత మంది మరణించారనేది ఇంకా తేలలేదు. పట్టాలు తప్పిన బోగీల్లోకి వరద నీరు చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వేఅధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

The helpline numbers are

Harda: 09752460088, Bhopal: 07554061609, Bina: 075802222, Itarsi: 0758422419200, Patna: 0612-2206967, Danapur: 06115-232398, Varanasi: 0542-2504221, 2503814, Mirzapur: 05442-220095, Allahabad 0532-2408149, 2408128; Kanpur: 0512-2323015, 2323016.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved