ఉదయిస్తున్న సూర్యుడి సాక్షిగా, ఎగిరే త్రివర్ణ పతాకం సాక్షిగా , భారతీయులుగా పుట్టినందుకు గర్వించండి. ఎవరైనా మన పుణ్య భారతదేశం గురించి చులకన చేసి మాట్లాడితే వెంటనే ఖండించండి. ఈమధ్య దేశంలోని కొందరు దుర్మార్గులు, నాయకులు చేసిన నీచపు పనులకు , సోషల్ మీడియాలో మన భారతదేశం గురించి రకకాలుగా చులకనగా కామెంట్లు చేస్తున్నారు. దేశాన్ని విమర్శించడం అంటే, అదేదో పెద్ద ప్యాషన్ గా భావిస్తున్నారు. ఈ భూమిపై పుట్టి, ఇక్కడి గాలిని పీల్చి, ఈ నీటిని త్రాగి, ఇక్కడ పండిన ఆహారంతో కడుపు నింపుకొని , ఎవరో చేసిన దుర్మార్గపు పనులకు మనం పుట్టిన పుణ్య భూమి మొత్తాన్ని విమర్శించడం ధర్మంకాదు. ఈ పుడమితల్లి క్షమించదు. " మనం పుట్టిన గడ్డ కన్నతల్లితో సమానం " మేరా భారత్ మహాన్ అని ఎలుగెత్తి చాటండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి, భరతమాత రుణాన్ని తీర్చుకోండి.

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved