ఆంధ్రప్రదేశ్ లో కుంగుతున్న భూమి.. కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. సంచలన వీడియో

ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లాలో చింతకొమ్మదిన్నె మండలంలో ఓ ప్రాంతంలో భూమి పెద్ద పెద్ద శబ్దాలతో కుంగిపోయింది. ఏదో కారణం ఉంటుందిలే అనుకున్న అక్కడి గ్రామస్తులు దానిని అంతగా పట్టించుకోలేదు. గంటలు గడిచే కొద్దీ గ్రామంలో భూమి కుంగుతున్న ప్రాంతాలు పెరిగాయి. నాయినోరిపల్లె గ్రామంలో ఏకంగా 15 ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో గ్రామంలో పెద్ద పెద్ద లోయలు ఏర్పడ్డాయి. భూమి కూలిన కారణంగా గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది.

వరుసగా చోటుచేసుకున్న ఘటనలతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు సమాచారాన్ని అధికారులకు అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అధికారులు గ్రామంలో ఏర్పడ్డ లోయలను చూసి షాక్ తిన్నారు. ముందు జాగ్రత్త చర్యల కింద గ్రామం నుంచి ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాయినోరిపల్లె గ్రామంలో భూమి కుంగిపోవడానికి గల కారణాలపై అధికార యంత్రాంగం ఆరా తీస్తుంది. అంతేకాక భూగర్భ శాస్త్ర నిపుణులను రప్పించి పరిశీలన జరిపిస్తున్నారు. ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరి ఎలా భూమి కుంగి పోయిందో మీరు ఈ క్రింది వీడియో లో చుడండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved