ఆయుష్షు గుట్టు ఇదుగో!

పురుషులతో పోల్చితే స్ర్తీల ఆయుష్షు ఎక్కువ. దీనికి కారణం తెలుసుకోవడానికి పరిశోధకులు పెద్ద ప్రయత్నమే చేశారు. చివరకు విజయం సాధించారు. స్ర్తీలు ఎక్కువకాలం జీవించడానికి గల కారణాలను గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు 1800 నుంచి 1935 మధ్య జన్మించిన వారి జీవితకాలాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో జన్మించిన వారిని ఎంచుకున్నారు. వీరి పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. స్ర్తీలతో పోల్చితే పురుషులు తక్కువ కాలం జీవించడానికి కారణమవుతున్న రెండు కారకాలను గుర్తించారు. ఒకటి స్మోకింగ్‌, రెండవది గుండె జబ్బులు. ఈ రెండు స్ర్తీలతో పోల్చితే పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణాల వల్లే పురుషులు త్వరగా చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved