అమ్మ...! నవమాసాలు మోసీ కనీ నన్నీ ప్రపంచానికి పరిచయం చేశావు... గర్భంలో నిన్ను కాళ్ళతో తంతూ బాధ పెట్టినా , ఆ బాధను ఓర్పుతో ఆనందంగా భరించావు..! పురిటి నొప్పులతో నీ ప్రాణం పోయేంత బాధను అనుభవిస్తూనే, నా ప్రాణం కోసం ఆరాటపడ్డావు..! నీ ఆకలి గురించి ఆలోచించకుండా, నాకు ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచావు...! గుక్కెడు పాలకై నా ఆకలి తీర్చుకొనుటకు నిన్ను నొప్పికి గురిచేస్తున్నా, ఆ బాధకు నీ కల్ల వెంబడి కారే కన్నీటినే , ఆనంద భాష్పలుగా మలిచి నా కడుపు నింపావు...! నీ ప్రాణాన్ని నాకు ఆయుష్షు గా పోశావు... దీర్గాయుష్మాన్భవ అని దీవిస్తూ వచ్చావు ... పూజిస్తే వరాలను ఇచ్చే ఆ దేవుని కంటే, ఈ సృష్టిలో నువ్వే నాకు గొప్ప అమ్మ...!! వానలో గోడుగువై ,ఎండలో నీడవై, చలిలో వెచ్చని మంటవై, ప్రతీ క్షణం నీ కంటిలో నన్ను కనుపాపగా చేసుకుని, నీ కనురెప్పలతో నన్ను కాపాడుతున్నావు...!! ఎలా తిర్చుకోను నీ ఋణాన్ని...? ఏమని తెలుపను నా పై నీ ప్రేమని...!? అందుకే ఇంకో జన్మ అంటూ ఉంటే నీకు తల్లిగా పుట్టి నీ రుణాన్ని తీర్చుకోవాలని ఉంది అమ్మ..!!

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved