మానసిక ఆరోగ్యానికి - శారీరక ఆరోగ్యానికి యోగా అవసరం

1) స్కూల్ కి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుండి , జీవితం చివరి మజిలిలో ఉన్న ప్రతి ఒక్కరికి పేదలు , ధనికులు ఎవర్ని గమనించినా , ఇంకా చెప్పాలంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి అను నిత్యం ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది.

2) అను నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరికేది కాదు. డబ్బులతో కొనేది కాదు.

3) ఒత్తిడి , ఆందోళన , భయం , కోపం , అనారోగ్యం వీటికి మానసిక ప్రశాంతతను ఇచ్చే హీలింగ్ తెరఫి కావాలి. అలాంటి ఏకైక హీలింగ్ తెరఫి యోగా - ధ్యానం.

4) యోగా ను నిత్య జీవితంలో భాగం చేసుకొంటే నూరేళ్ళు ప్రశాంతంగా జీవించవచ్చు. యోగాతో మానసిక ఆరోగ్యమే కాకుండా , శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

5) రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు బయటికి నెట్టబడతాయి. చర్మం కాంతివంతం అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొంటారు.

6) మెదడు , గుండె , ఊపిరితిత్తులు , కాలేయం , కిడ్నీలు , ఇంకా అంతర్గత అవయవాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

7) అస్తమా , శ్వాస సంభంద రోగాలకు యోగా మంచి ఉపసమనం. శ్వాస క్రియ మెరుగు పడుతుంది.

8) కనీసం రోజులో పద్మాసనం , సుఖాసనం , ప్రాణాయామ, శవాసనం , లాంటివి చేసుకొన్నా సరిపోతుంది.

మీ మిత్రులకి కూడా షేర్ చెయ్యండి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved