సీలుపైన పెప్సీ పేరు... సీసాలో చూస్తే నిండా బీరు

సౌదీ అరేబియాలో మద్యపానంపై అత్యంత కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఆల్కహాల్ తాగడమే కాదు, కనీసం దగ్గర ఉంచుకోవడం కూడా తీవ్రమైన నేరం.. దోషులకు విధించే శిక్షలు భయానకంగా ఉంటాయి. అంతటి కఠిన నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ స్మగ్లర్లు భయపడటం లేదు. పెప్సీ డబ్బాల్లో బీరు పోసి రవాణా చేస్తున్నారు. ఈ నకిలీ సీసాలను పెప్సీ కవర్‌తో సీల్ చేస్తున్నారు. సౌదీలోని అల్‌ బతా సరిహద్దుల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా స్మగ్లర్ల గుట్టు రట్టయింది. ఒక్కో ప్యాక్‌లో 24 బాటిల్స్‌తో 48 వేల కేన్ల బీరు దొరికింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. బీరు సీసాలపై ఉన్న నకిలీ పెప్సీ కవర్‌ను ఒక అధికారు బాక్స్ కట్టర్‌తో తొలగించడం అందులో కనిపిస్తుంది. ఆ వీడియో ఇక్కడ చూడండి...

don't drink and please share for friends and family kindly share it


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved