ఈ ఫోటో వరల్డ్ ఫోటోగ్రఫీ లో ప్రధమ బహుమతి గెలుచుకుంది.

కానీ..

ఈ ఫోటో వల్లనే ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

.

కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో దరిద్రం తాండవిస్తోంది. తినడానికి తిండి లేక వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బతికుండగానే రాబందులు వచ్చి పీక్కు తినే పరిస్థితి. వాళ్ల జీవనం మీద అధ్యయనం చేయడానికి అక్కడికి కొంతమంది పర్యటనకి వెళ్లారు. అప్పుడు తీసిందే ఈ ఫోటో.

.

ఒక బాలుడు ఆకలికి అలమటిస్తూ కదల్లేని స్థితిలో ఉంటే.. ఆ బాలుడిని తినడానికి ఒక రాబందు చూస్తూంటే ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు.

. .

ఆ రాబందు రెక్కలు విప్పితే ఇంకా బాగా ఫోటో తియ్యొచ్చునని ఆ ఫోటోగ్రాఫర్ చాలా సేపు అలానే ఉన్నాడట. అదే విషయాన్ని అతను ప్రధమ బహుమతి అందుకునేటప్పుడు చెప్పాడు.

.

అక్కడనుండే అసలు విషయం మొదలయ్యింది. ప్రధమ బహుమతి గెలుచుకున్న ఫోటోకి ప్రశంసలు వెల్లువెత్తుతాయి అనుకున్న అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది.

.

ఆ ఫోటోగ్రాఫర్ మీద ప్రపంచం దుమ్మెత్తి పోసింది. అక్కడ నీకు మానవత్వం గుర్తురానప్పుడు నువ్వు మనిషివి ఎలా అవుతావు అనీ.... అక్కడ ఉంది ఒక రాబందు కాదు నీతో కలిపి రెండు అనీ... ఒక పక్క సహాయం కోసం బాలుడు ఏడుస్తుంటే నీ దృష్టి మాత్రం నీకు వచ్చే బహుమతి మీదనే ఉంది అనీ...

ఆ బాలుడితో పాటు నువ్వు కూడా అక్కడే చనిపోయావు అనీ..

ఇలా రకరకాల మాటలతో అతని మనసు క్షోభించి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved