కుప్పకూలిన రష్యా విమానం.. 212 మంది దుర్మరణం..!

200 మంది ప్రయాణికులతో నింగికెగసిన రష్యాకు చెందిన విమానం అడ్రెస్ గల్లంతు అయింది. ఈజిప్ట్ నుంచి రష్యాకు బయలుదేరిన సదరు విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం గల్లంతైన సమాచారంతో అటు రష్యాలోనే కాక ఈజిప్ట్ లోనూ కలవరం మొదలు అయింది. విమానం ఆచూకీ కోసం ఇరు దేశాలకు చెందిన ఏవియేషన్ అధికారులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఈజిప్ట్ లోని సినాయి ద్వీపకల్పాన్ని దాటుతుండగా ఈ విమానం ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తుంది. అయితే ఇంతలోనే రష్యా బయలుదేరిన రష్యన్ విమానం సినాయ్ దీవుల్లో కూలిపోయింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఈజిప్ట్ ప్రధాని ఇబ్రహీం మహ్లాబ్ ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం కలిసి 212 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు రష్యాకు చెందినవారేనని సమాచారం. తొలుత టర్కీ గగనతలంతో విమానం ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలు వెలువడ్డ క్షణాల్లోనే ప్రమాదం సంభవించిందని ఈజిప్ట్ ప్రధాని ప్రకటించారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved